మాలకొండయ్యకు అండగా కనపర్తి మనోజ్ కుమార్

  • ఆంధ్రప్రదేశ్ యస్సి కమీషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఎం.ఏ.ఎల్ఎల్బి ని విజయవాడలో కలిసిన పొన్నలూరు జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో, సుంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లపు మాలకొండయ్య (యస్సి మాల) కి 10-04-1977 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నందువలన ప్రభుత్వం వారు మాలకొండయ్యకు సర్వే నెంబర్ “153-1 ఆఛ్ 2.71” సెంట్లు భూమిని ఇచ్చి, పట్టాదారు పాస్ పుస్తకం కూడా అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది, ఆ భూమిని వంశపారపరంగా వ్యవసాయం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

29-07-2012 లో కూడా వారికి తెలియకుండా వారి పొలంలో కట్టెలు కొట్టుకోవడం జరిగింది, ఇదేంటి మా పొలంలో కట్టెలు కొట్టారని మాలకొండయ్య కుటుంబ సభ్యులు అడగగా ఆరోజు వాళ్లను కొట్టడం జరిగింది, దళిత నాయకులు వచ్చి వారందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది, ఎస్ ఐ వారిని పిలిపించి విచారించి ఈ పొలానికి అగ్రకులస్తులకు ఎటువంటి సంబంధం లేదని ఒప్పంద పత్రం కూడా రాయించి ఇవ్వడం జరిగింది, అప్పటికి ఆన్ లైన్ లో కూడా నల్లపు మాలకొండయ్య పేరు ఉంది.

అదేవిధంగా 2017 వ సంవత్సరంలో నాటి ఎంఆర్ఓ సర్వే చేసి ఈ పొలం నల్లపు మాలకొండయ్య గారిదే అని చెప్పి హద్దురాళ్లు కూడా వేయడం జరిగింది, ఆరోజుకి ఆన్లైన్లో నల్లపు మాలకొండయ్య పేరు మాత్రమే ఉంది.

ముండ్లమురివారిపాలెం గ్రామ అగ్ర కులస్తులు అయినటువంటి

  1. తానికొండ సుబ్బారావు తండ్రి నారాయణ
  2. నల్లూరి కోటయ్య తండ్రి నరసయ్య
  3. నల్లూరి బాలకోటు తండ్రి పెద్ద కొండయ్య
  4. నల్లూరి శ్రీను తండ్రి చినకొండయ్య
  5. తానికొండ సుంధరరావు తండ్రి నారాయణ
  6. నల్లూరి రోశయ్య
  7. ముప్పరాజు యలమంద తండ్రి సుబ్బయ్య

పైన తెలిపిన ఏడుగురు అగ్రకులస్తులు 12-07-2022న సాయంత్రం మూడు గంటల సమయంలో మాలకొండయ్య కుటుంబ సభ్యులు వెళ్లి వారి పొలంని చూడగా చెట్లు మొత్తం కొట్టుకుని జేసీబీ తో మొద్దులు తీసివేసి ఉన్నారు, నల్లపు మహేంద్ర, వారి అమ్మ, మరియు వారి నాయనమ్మ, ముగ్గురు వెళ్లి అడగగా అధికారం ఉందన్న గర్వంతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మా చేతిలో అధికారం ఉంది మీ దిక్కున చోట చెప్పుకోండి, పోలీస్ వారు కూడా మమ్మల్ని ఏమి చేయలేరు అని అంటున్నారు, వాళ్లు తిట్టిన ప్రతి మాట మా సెల్ ఫోన్ లో రికార్డు చేసారు, వారి దగ్గర నుండి బలవంతంగా వారి ఫోన్ లాక్కున్నారు, వారి ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోలు డిలీట్ చేసి, వారి ఫోన్ ని పగలగొట్టారు, నువ్వు ఎవడివిరా నీకు ఈ పొలానికి సంబంధం లేదు, ఈ పోలంలోనికి మీరు రావద్దు, మీరు మాలనాకొడుకులు, మీకు ఇక్కడ భూమి లేదు అని బెదిరిస్తూ చెట్లు కొట్టే కత్తులతో పోడిచేస్తాం అని వారిని తిడుతూ, వారి పైన చేయి చేసుకుని ఆడవాళ్లు పైగా ముసలి వాళ్లు అని కూడా చూడకుండా వాళ్లను కొట్టారు, మావూరి మీదుగా మీరు వెళ్ళటప్పుడు మర్డర్ చేస్తాం అని బెదిరిస్తూ, వాళ్ళును పోలంలోనికి రానివ్వకుండా బెదిరిస్తున్నారు, మీరు మాలనాకోడుకులు అని భూతులు తిడుతున్నారు, మాకు పొలం ఇవ్వకపోతే మీ కుటుంబం మొత్తం అంతు తెలుస్తాము, ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న మీ మాల మాదిగ వాళ్ళ పొలాలు కూడా ఆక్రమిస్తాము, కారంచేడులో చుండూరులో ఎలా జరిగిందో మీ వాళ్ళని ఎలా చంపేసామో మీకు కూడా అదే గతిపడుతుంది, అని అంటున్నారు, కావున వారి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, అగ్రకులస్తుల నుండి వారికి ప్రాణహాని ఉంది, దళితులను రక్షించండి, ఎంఆర్ఓ ని మరియు విఆర్.ఓ ని మరియు సర్వేయర్ ని వారి పొలం వద్దకు పంపించి విచారణ చేయించి వారి పొలం వారికి ఇప్పించమని మరియు వారికి నష్టపరిహారం కూడా ఇప్పించమని, దయచేసి వారి యందు దయవుంచి వారికి న్యాయం చేయండి అని ప్రార్థిస్తున్నాము. అని పూర్తి వివరాలతో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన గౌరవనీయులు మారుమూడి విక్టర్ ప్రసాద్ కి, మరియు గౌరవనీయులు దర్శి డిఎస్పి కి, అదేవిధంగా గౌరవనీయులు పొన్నలూరు ఎస్ఐ కి, మరియు పొన్నలూరు ఎంఆర్ఓ కి పొన్నలూరు జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ వివరించడం జరిగింది.