గిరిజనేత్రుడు కబ్జాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

కొర్రా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వసూలు మత్తులో అధికారులు సిబ్బంది మండల కేంద్రమైన అనంతగిరి వ్యవసాయ శాఖ కార్యాలము పక్కన ఉన్న వ్యవసాయ శాఖ స్థలమును ఒక వ్యాపారి గిరిజనేత్రుడు కబ్జాకు పాల్పడిన అధికారులకు సిబ్బందికి కంటికి కనిపించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. కార్యాలయం పక్కనే ఉన్న స్థలము ఇలా అక్రమం జరుగుతుంటే అధికారులు సిబ్బంది కేవలం ప్రత్యేక పాత్ర పోషిస్తూ వసూలు మత్తులో ఉండిపోయారని జనసేన పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ శనివారం విలేకరులు ముందు మాట్లాడుతూ తెలిపారు. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ స్థలములు ఇప్పటికే అక్రమాలకు గుర్తిస్తే చర్యలు మాత్రం అధికారులు తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని నాయకులు మాట్లాడుతూ తెలిపారు. ఇప్పటికైనా నూతనంగా అనంతగిరి మండలానికి వచ్చిన తాసిల్దార్ ప్రభుత్వ స్థలలు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విలువైన స్థలములు కాపాడాలని నాయకులు మాట్లాడుతూ తెలిపారు అనంతగిరి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయం పక్కన ఉన్న స్థలమును అలాగే అనంతగిరి మండల పరిషత్ సిబ్బంది క్వార్టర్స్ లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను పూర్తిగా నిలిపివేసి జె సి బి లతో నేలకుర్చాలని అధికారులు ఇచ్చిన నోటీసులకు మాత్రము పట్టించుకోకుండా పనులు రాత్రిపూట పనులు కొనసాగుతున్నాయని వీటి అన్నిటికి రాజకీయ నాయకులు ఉన్నత అధికారులు అండదండలతోనే ఇలా స్థలలు కబ్జాకు గురై ఉన్నాయని నాయకులు మాట్లాడుతూ తెలిపారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ కట్టడాలపై నిలిపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి పాల్గొన్నారు.