జోరువాన సాక్షిగా.. వైస్సార్సీపీ నుంచి జనసేన పార్టీ లోకి భారీ చేరికలు..

సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామానికి చెందిన… సుమారు 100 మంది వైస్సార్సీపీ నుంచి… రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల సమక్షంలో.. జనసేన పార్టీలో చేరడం జరిగింది.

ఈ జాయినింగ్స్ కార్యక్రమం సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, ముత్యాల హరీష్, బంగారం, తోట సూర్య మణికంఠ, ప్రగడ శ్రీహరి, గట్టి సత్యనారాయణమూర్తి వారి కృషితో.. రఘుదేవపురం గ్రామానికి చెందిన దాసరి కోటేశ్వరరావు, సాంబేలు రామచంద్రం, అడ్డాల వెంకన్న, రామచంద్రం, శెట్టి సిద్ధరామకృష్ణ, అడ్డాల అంజి, అడ్డగర్ల వెంకటరావు తదితరులు సుమారు 100 మంది జనసేన లో చేరడం జరిగింది.