పెళ్లి సందడి తాజా అప్‌డేట్

1996లో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల రాఘవేంద్రరావు వెల్లడించారు.

‘పెళ్లిసందడి’ పేరుతో రాఘవేంద్రరావు ఓ కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించారు. ఆర్కా మీడియా వర్క్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాధామోహనరావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరరచన చేయనుండగా చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించబోతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చిత్రం రూపొందనుందని, చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో రోషన్ లుక్ చాలా బాగుంది. ఇక ఈ చిత్రాన్ని కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనాంకి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర కథానాయిక ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.