కట్టు బానిసలుగా వైసీపీ కాపు నేతలు

  • పదవుల కోసం వ్యక్తిత్వాన్ని చంపుకొని జీవచ్చవంలా బ్రతుకుతున్న మంత్రులు
  • ఆత్మాభిమానం, ఆత్మగౌరవాణ్ణి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వైసీపీ కాపు నేతలు
  • చరిత్ర హీనులుగా, శిఖండుల్లా మారిన కాపు వైసీపీ నేతలు
  • వైసీపీ కాపు నేతలపై విరుచుకుబడ్డ జిల్లా కాపు యువ నాయకులు ఆళ్ళ హరి

గుంటూరు, తుచ్ఛమైన పదవుల కోసం తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర పెట్టి వైసీపీలోని కాపు నేతలు కట్టు బానిసల్లా బ్రతుకుతున్నారని, వీరిని కాపు జాతి క్షమించదని జిల్లా కాపు యువత అధ్యక్షుడు ఆళ్ళ హరి అన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, కాపు మంత్రులకు బానిస సంకెళ్ళ నించి విముక్తి చేసి వారికి మంచి బుద్ధి ప్రసాదించమని శ్రీనివాసరావుతోటలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కన్నెగంటి హనుమంతు విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ… దాదాపు కోటీ నలభై లక్షల మందికి పైగా ఉన్న కాపు జనాభాలో తమకు బానిసల్లా ఉండేవారిని, తమ బూట్లు నాకేవారిని ఎన్నుకొని వారికి పదవులు ఇచ్చి కాపు జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రకు ముఖ్యమంత్రి తెరతీసారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్జిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చక పోయినా ముఖ్యమంత్రిని అడిగే దమ్మూ ధైర్యం లేని కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని తిట్టేందుకు మాత్రం సిగ్గు, శరాన్ని వదిలేసి మీడియా ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. 32000 కోట్లు కాపు సంక్షేమానికి ఖర్చు చేసినట్లు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాపు యువతకు ఉపాధి కల్పించేందుకు సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానన్న వాటికే దిక్కులేనప్పుడు అన్ని కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలన్నారు. వివిధ పథకాల పేరుతో ఖర్చు పెట్టమని చెబుతూ మరోసారి కాపుల్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లిన సుమారు 1150 మంది కాపు విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు కనీస ప్రయత్నం చేయని కాపు నేతలు కాపు ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. కాపుల జీవితాలతో చెలగాట మాడితే పుట్టగతులుండవని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చింతా రాజు మాట్లాడుతూ కాపుల్ని విభజించు పాలించు సిద్దాంతంతో ఇన్నాళ్లు మోసం చేసారని, ఇప్పుడు వైసీపీ కూడా అవే కుట్రలను కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుషం లేని వాళ్ళని, సిగ్గూ శరం వదిలేసి వ్యక్తిత్వం లేకుండా బ్రతికే కొంతమంది కాపుల్ని శిఖండుల్లా అడ్డుపెట్టుకొని వైసీపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మీరు బానిసలుగా బ్రతకండి కానీ కులానికి మాత్రం మీ బానిసత్వాన్ని అంటగట్టకండి అంటూ కాపు నేతల్ని హెచ్చరించారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ పై కాపు జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు , మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, దాడిశెట్టి రాజా చిత్ర పటాలను చెప్పులతో కొట్టారు. ఈ కార్యక్రమంలో చెన్నా పోతురాజు, రవీంద్ర, షర్ఫుద్దీన్, లక్ష్మీశెట్టి నాని, బుడంపాడు కోటి, ఇళ్ల శేషు, బాషా, రాము, హేమంత్, సుబ్బారావు, సాంబశివరావు, చిరంజీవి, నండూరి స్వామి, తిరుపతిరావు, సాయి, తేజ తదితరులు పాల్గొన్నారు.