నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా కాసరంలో పర్యటించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తొట్టంబేడు మండలంలోని కాసరం పంచాయతీలో.. కాసరం ఎస్సి కాలనీ.., కాసరంలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు ఉన్నా కూడా నిరుపయోగంగా ఉంది. పేద ఎస్సి/ఎస్టీ కుటుంబాలకు ఎన్నికలప్పుడు 200 యూనిట్లు ఉచితం అని చెప్పి కరెంట్ బిల్లులు 5 వేల నుండి 20 వేలు విధిస్తున్నారు. కరెంట్ కోతలతో రైతుల ఇబ్బందులు, పారిశుధ్యం సమస్యలు, శ్రీమతి వినుత దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యలను మండల అధికారుల, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు ప్రతాప్, సంజీవ్, వినోద్ కుమార్, నితీష్ కుమార్, శివ, ప్రమోద్, చందు చౌదరి, సురేష్, వెంకటరమణ జనసైనికులు పాల్గొన్నారు.