జనసేనాని జన్మదిన వేడుకలలో భాగంగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చిన జనసేన నాయకులు

జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం
ఇడిమేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం జరిగింది.

ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్లపై ఉన్న గుంతలను పుడ్చ మంటే నిమ్మక్క నీరు ఎత్తినట్లు ఉందంటే ప్రజల బాగోగులు మీకు పట్టవా రోడ్లపై ప్రయాణిస్తున్న టూవీలర్లు, ఆటోలు, కార్లు మొదలగు వాహనదారులు ఈ గుంటల రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ.. నానా అవస్థలు పడుతూ ఉంటే నిమ్మకు నీఈరెత్తినట్లుగాఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు కావస్తుంటే.. ఇప్పటివరకు ఫ్లెక్సీలు వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది కాబట్టి ఫ్లెక్సీలు నివారించాలి అనేటువంటి ఆలోచన రాకపోవడం సిగ్గుతో కూడిన విషయం.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సమయంలో.. సినిమా టికెట్లు పైన.. ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు ఫ్లెక్సీలు పైన, ప్రజల పైన ఉతుత్తి మమకారాన్ని చూపించే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టే స్థితిలో ఉందా..? ఇకనైనా మీ దృష్టి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాల మీద, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లమీద రక్షణ లేని మహిళల మీద దృష్టి పెట్టాలని.. అదేవిధంగా మిపార్టీ నాయకులు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని.. లా అండ్ ఆర్డర్ ని సరైన మార్గంలో నడిచే విధంగా చూడాలని మేము జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, రహమాన్ భాయ్, రామిరెడ్డి, శ్రీహరి, రహీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *