మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నూజివీడు జనసేన

తెనాలి, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసిన నూజివీడు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు. నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యులు తెనాలిలో జనసేన పార్టి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ని అయన కార్యాలయంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా మనోహర్ పార్టీ ఆవిర్భావ సభకి నూజివీడు నియోజకవర్గం నుండి వందలాది మందిని తరలించి విజయవంతం చేసిన నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబుని ప్రత్యేకంగా మెచ్చుకుని, అభినందించారు. బర్మా ఫణి బాబుతో పాటు ఉమ్మడి కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు తోట వెంకట్రావు, పాశం నాగబాబు, సూరిశెట్టి శివ, పుప్పాల రాంబాబు కలిసి నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు.