జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండాలనేదే మా అధ్యక్షులు వారి ఆకాంక్ష: గాదె

వేమూరు నియోజవర్గం, చావలి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సోమరౌతు వీరస్వామి కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. వారు సర్జరీ నిమిత్తం హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మంగళవారం హాస్పిటల్ కి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం ధైర్యం చెప్పి, మరియు డాక్టరుతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.