బీసీలను నిలువునా మోసం చేసిన జగన్ ప్రభుత్వం

  • బీసీల ఆత్మగౌరవ సభ కాదు, బీసీల వంచన సభగా పేరు పెట్టుకోండి
  • బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించినందుకా సన్మానాలు
  • ఆర్ కృష్ణయ్య బీసీల దళపతి కాదు… దళారి?
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు మంగళం పాడింది వైసీపీ
  • నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం
  • త్వరలోనే బీసీ గర్జన సభ నిర్వహిస్తాం
    *జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్

విజయవాడ, పస్చిమ నియోజకవర్గం, బీసీలకు అమలు చేయాల్సిన సబ్ ప్లాన్ ను అమలు చేయకుండా, 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా కేవలం బీసీలను మభ్యపెట్టేందుకే వైసీపీ బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో కొత్త నాటకాలు మొదలుపెట్టిందని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద స్పందించడం లేదు. తెలంగాణలో ఏపీకి చెందిన 15 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మంది బీసీలు స్థానిక సంస్థల పదవులకు దూరం అయ్యారు. దీనిపై కనీసం బీసీల పక్షపాతి అని చెప్పుకునే కృష్ణయ్య న్యాయ పోరాటం కూడా చేయలేదు.

  • ఆర్.కృష్ణయ్య సమాధానం చెప్పాలి
    బీసీల హక్కులను కేసీఆర్ దత్తపుత్రుడు జగన్ డైరక్షన్లోనే తాకట్టు పెట్టారు. బీసీల రాజ్యాధికారాన్ని, వారి ఆత్మగౌరవాన్ని పదేపదే అణగదొక్కాలని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఏం సాధించారని బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాలరాస్తున్న బీసీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన కృష్ణయ్య కేవలం తన రాజ్యసభ సీటు కోసం బీసీ కులాలను గంపగుత్తగా తాకట్టు పెట్టారు. బీసీ సంక్షేమ సంఘం అసలు లక్ష్యం పక్కదారి పట్టించి, వ్యక్తిగత ప్రయోజనం కోసమే ఆర్.కృష్ణయ్య పని చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు కాపాడలేని వ్యక్తులు జాతీయస్థాయిలో బీసీల హక్కుల కోసం పోరాడతామని కపట మాటలు చెప్పడం మానుకోవాలి. బీసీలను ఎంత కాలం మభ్యపెడతారు..? మీ పబ్బం గడుపుకుంటారు..? ఆర్.కృష్ణయ్య చేస్తున్న కుటిల ప్రయత్నాలను బీసీలంతా గమనించాలి. బీసీలకు ఏం చేశారని ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సన్మానాలు చేస్తారు..?
  • బీసీలను సామాజిక మోసం చేశారు
    జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు జరిగింది సామాజిక న్యాయం కాదు. కేవలం సామాజిక మోసం మాత్రమే. బీసీల సబ్ ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లను వివిధ పథకాలను మళ్లించి, జగన్ ప్రభుత్వం బీసీలను సవతి తల్లి ప్రేమను కురిపిస్తోంది. దీనికి బీసీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు. నామినెటెడ్ పోస్టుల్లో జగన్ ప్రభుత్వం కేవలం 5 శాతం మాత్రమే బీసీలకు ఇచ్చిందనే విషయం ఈ ప్రజాప్రతినిధులకు తెలియదా..? టీటీడీ బోర్డులో 36 మంది సభ్యులుంటే కేవలం బీసీలకు ఇచ్చింది 3 పదవులు మాత్రమే. విశ్వవిద్యాలయాలకు 16 మంది వైస్ ఛాన్సలర్ పోస్టులుంటే, ఒక్కటి మాత్రమే బీసీలకు ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారులు 30 మందికి పైగా ఉంటే, బీసీలకు ఇచ్చింది ఒక్క పదవే. గతంలో 14 బీసీ కార్పొరేషన్లు ఉంటే, వాటిని జగన్ ప్రభుత్వం 56కు పెంచింది. అయితే వీటి ద్వారా కనీసం రూపాయి రుణాలు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. 139 బీసీల కులాలను ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది. చేతి వృత్తులు, కుల వృత్తులను నిర్వీర్యం చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీసీల ముసుగు వేసుకొని, అగ్రకులాలకు ఊడిగం చేసింనందుకు బీసీలకు సన్మానం చేస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి.
  • బీసీలకు ఏదీ విదేశీ విద్య, ఏదీ పెళ్లి కానుక..?
    జగన్ ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యా పథకానికి వెళ్లిన బీసీలు ఎందరు..? ప్రభుత్వం నుంచి సాయం పొంది ఉన్నత చదువులు అభ్యసించిన వారెవరు అన్నది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే పెళ్లి కానుక పథకాన్ని ఆపేశారు. బీసీల్లో పేద వర్గాలే అధికం. వారిక పెళ్లి సమయంలో ఆర్థిక దన్నుగా ఉండే పెళ్లికానుక నిలిపివేయడం వల్ల ఎందరో బీసీలు ఇబ్బందులు పడ్డారు. బీసీలకు ఆధునిక పనిముట్టన ఇచ్చే ఆదరణ పథకం ఎత్తివేసినా బీసీ నాయకులు కనీసం అడగలేదు. చేనేతలకు కేటాయించిన బడ్జెట్ ను జీవో నంబరు 65 ద్వారా ఈ ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించింది. మత్స్యకార అభ్యున్నతిని కాలరాసే జీవో నంబరు 215తో వారిని తూట్లు పొడవాలని చూస్తోంది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటూ మాటల్లో చెబుతూ… చేతల్లో మాత్రం బీసీల వెన్ను విరిస్తున్న జగన్ ప్రభుత్వానికి బీసీ సంఘాల నాయకులు వంత పాడటం బీసీలను కచ్చితంగా ద్రోహం చేసినట్లే అవుతుంది. బీసీల కోసం చేసిన ఉద్యమాలు తాకట్టు పెట్టే హక్కు ఆర్.కృష్ణయ్య లాంటి నాయకులకు లేదు. బీసీలను నిలువుగా ముంచే ఇలాంటి వారు కచ్చితంగా బీసీ వర్గాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బీసీల హక్కుల కోసం, వారికి రాజ్యాధికారం ఇచ్చేందుకు నిజాయతీగా పనిచేసే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అంతా అండగా నిలబడాలి. జగన్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసాలను తెలిపేందుకు అతి త్వరలోనే బీసీ గర్జన సభ నిర్వహిస్తాం. దానికి అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తాం. రాష్ట్రంలోని బీసీ నాయకుల్ని కలుపుకొని బీసీల కోసం బలమైన పోరాటాలు చేస్తాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు జరిగిన న్యాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి” అని డిమాండు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బోట్ట సాయి, నగేష్, పొట్నూరి శ్రీను, రాకేష్ గౌడ్, డి. దుర్గ భవాని, వి.వెంకటేష్, మద్దెల కనకారావు, రాజు, సబిన్కర్ నరేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.