సేవ్ పవన్ – సేవ్ ఆంధ్ర

  • పవన్ పై ఈగ వాలిన జగన్ దే భాధ్యత
  • బేడీలు వేసుకున్న కేడీలు ఇలాంటి పనులు చేస్తున్నారు
  • ప్రజాదరణ కలిగిన పవన్ పై దాడి చేయడానికి ప్రణాళిక వేశారు
  • వైజాగ్ లో పోలీసు పహర, హైదరాబాద్ లో గుండాల పహార చేస్తున్నారు
  • పవన్ కి ఏమైన జరిగితే జనసైనికులు ఒకొక్కరు ఒక్కొక్క మిసైల్ అవుతాం
  • ఈ రెక్కీ జరిపిన వారిని విచారించాలి
  • పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
  • హెచ్చరించిన జనసైనికులు

తిరుపతి, తమ జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఈగ వాలినా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన పార్టీ నేతలు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, డా.బాబు, సుమన్ బాబు, పార్డు, ఆనంద్, మునస్వామి, కృష్ణయ్య, బలరామ్, రాజేష్ ఆచారి, హేమంత్, బాలాజీ, పురుషోత్తం రాయల్, సాయి, పురుషోత్తములు హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం మీడియాతో వీరు మాట్లాడుతూ… తమ అధినేత పై గీత పడ్డా ఒక్కో జనసైనికుడు అను బాంబుగా మారుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జనసేనానికి జనంలో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు, సేవ్ పవన్ కళ్యాణ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. తమ అధినేత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బేడీలు వేసుకున్న కేడీలు కూడా సమాజంలో ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ దాడులకు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజాదరణ కలిగిన తమ పవన్ పైనే హత్యాయత్నానికి పూనుకున్నారంటే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కిమ్ పాలనాలా ఇక్కడ జగన్ జిమ్మిక్కులతో ఏపీని అంధకారంలో తీసుకెళుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు, కిమ్, జగన్ పాలనలో తేడా ఏమీ లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో రెడ్ల పాలకులు పాలన కొనసాగిస్తున్నారని, పోలీస్ యంత్రాంగంలో కూడా రెడ్లే ఉండడం బాధాకరమన్నారు, ఈ రెడ్లపాలనలపై తమకు నమ్మకం లేదని, పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.