బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామానికి చెందిన ఉప్పాడ యస్వంత్(8) మరియు పులి సతీష్ కుమార్(5) సంవత్సరాలు అను ఇద్దరు పిల్లలు సైకిల్ పై బ్రహ్మ లింగం చెరువు దగ్గరలో ఆడుకొనుచుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి, నీటమునిగి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్నిచ్చి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. జనసేన పార్టీ తరుపున 10,000₹ రూపాయలు బాధిత కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు, కొచ్చర్ల బాబి, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, కాపవరం జనసేన పార్టీ నాయకులు సోడాసాని శివాజీ, తొరటి దుర్గాప్రసాద్, కోరుకొండ సోషల్ మీడియా ప్రతినిధులు రచ్చపోతుల సురేష్, సతీష్, మండపాక మురళి, అడపా అంజిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.