స్పందన కార్యక్రమంలో తాళ్ళరేవు జనసేన వినతి

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం జనసేన పార్టీ తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన ప్రభుత్వం తలపెట్టిన స్పందన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లా జనసేనపార్టీ మహిళా రీజినల్ కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, మండల కార్యదర్శి మణికంఠ, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.