జగనన్న కాలనీల మోసాన్ని ఎండ గట్టిన ఆముదాలవలస జనసైనికులు‌

ఆముదాలవలస: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆముదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం అప్పల పేట పంచాయతీలో గిరిజన గ్రామం బూర్జ మన గూడు అనే గ్రామంలో ప్రభుత్వం అందజేసిన జగనన్న ఇల్లు స్థలాలను జనసేన పార్టీ బూర్జ మండల నాయకులు‌ మజ్జి రాంబాబు, తోట అప్పలరాజు ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మంజూరు చేశామని ఇప్పటివరకు 50 శాతం ఇళ్లను పూర్తి చేసామని చెబుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చాలా చోట్ల ఇప్పటివరకు పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదని కానీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు చెబుతున్నారని అన్నారు.. కానీ ఈ గిరిజన గ్రామంలో 10 శాతం ఇల్లును పూర్తి చేయలేదు అని ఆరోపించారు. వీరందరికీ న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేత సాయికుమార్, సాంబ, మన్మధరావు అలాగే లబ్ధిదారులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.