స్వగ్రామాలకి దూరంగా కొండలపై జగనన్న ఇల్లు

పాలకొండ నియోజకవర్గఒ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం పరిధిలోని వివిధ గ్రామ పంచాయితీలలో జగన్ అన్న కాలనీల నిర్మాణానికి స్థల సేకరణ తీరును జనసేన నాయకులు వివరించడం జరిగింది. మత్స.పుండరీకం, జనసేన జాని, వావిలపల్లి నాగభూషన్ లు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇల్లు నిర్మాణం పై వీరఘట్టం మండలం పరిధిలో వివిధ గ్రామాలను మూడురోజులుగా సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మత్స.పుండరీకం మీడియాతో మాట్లాడుతూ ఊరి చివర ఉన్నాయి జగనన్న కాలనీలు – ప్రజలు కారుస్తున్నారు కన్నీళ్లు. తక్కువ ధర ఉన్న నాసిరకం భూములు ఉన్న రైతులు సంప్రదించి. వారికి మార్కెట్ రేట్ కి 3 రెట్లు ఇస్తాం అని ఆశ చూపి స్థలం తీసుకున్నారు, రైతు దగ్గర బలవంతంగా కమీషన్ వైస్సార్సీపీ నాయకులు తీసుకున్నారు. మట్టి తవ్వి అమ్మేసుకున్న గోతులు, స్మశానం పక్కన ఉన్న భూములు, వర్షం వచ్చిన, వరద వచ్చిన మునిగిపోయే ఏటు గట్టు భూములు సేకరణ చేసి గృహ స్థలాలు ఇచ్చారు. లబ్ధిదారులు ఎవరు నోరు ఎత్తకుండా. మూడేళ్ళ తర్వాత ఇవి మీరు అమ్ముకోవచ్చు అని చెల్లని హామీలు ఇచ్చారు ఇక్కడి వైస్సార్సీపీ నాయకులు.ఇల్లు నిర్మాణం చెయ్యకపోతే స్థలం వెనక్కి తీసుకుంటాం అని బెదిరింపులు చేస్తున్న వైస్సార్సీపీ నాయకులు, 180000 ప్రభుత్వం గృహ నిర్మాణం కి ఇస్తుంది, ప్రస్తుతం ఉన్న ఇంటి నిర్మాణం కి సంబంధించిన ముడిసరుకుల ధరలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఒక ఇంటి నిర్మాణం కి కనీసం 5 లక్షల నుండి 6 అవుతుంది. లబ్ది దారులు పై పెను భారం పడుతుంది. గృహ నిర్మాణం కి ఇచ్చిన స్థలం ఉండాలి అంటే లబ్ధిదారులు అప్పులు పాలు అయ్యి ఇల్లు కట్టాలి. జనసేన జాని మాట్లాడుతూ కొన్ని కాలనీలలో మూడు లేదా నాలుగు అడుగులే రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు లేవు. పంచేది ప్రభుత్వ భూమి కాదు. ప్రజల సొమ్ముతో కొన్న నాసిరకం మౌళిక వసతులు ఉన్న భూములు జగన్ అన్న ఇల్లు జనాలకి కన్నీళ్లు తప్ప మరేమిలేదు అని అన్నారు. వావిలపల్లి నాగభూషన్ మాట్లాడుతూ నిస్వార్ధ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ని, జనం కోసం జనసేన పార్టీని స్థాపించారు. #జగనన్నమోసంతో సోషల్ మీడియా ద్వారా సమస్యలు తెలియజేసాము. తక్షణమే గృహ నిర్మాణాలు చేపట్టాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము.