గొడిచెర్ల గ్రామంలో జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు

పాయకరావుపేట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇళ్ళలో అవకతవకలపై ప్రతీ గ్రామంలో డిజిటల్ క్యాంపెయిన్ గా నిరసన తెలియజేయాలని పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి ఆదేశాలు మేరకు నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో #JaganannaMosam హాష్ టాగ్ తో నిరసన తెలియజేశారు. జనసేన నాయకులు నల్లల రత్నాజి మాట్లాడుతూ గొడిచెర్ల గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీసం రవాణా మార్గంగాని నీటి సదుపాయం లేకపోవడం వలన స్థలాలు ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఒక లబ్ధిదారుడు కూడా కనీసం సంకుస్థాపన కూడా చేయలేదు. పేదలకు ఇళ్ళు నిర్మించుకోలేక పేదలకు ఇళ్ళు కన్నీలుగానే మిగిలాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆచంటి వీరబాబు, సత్తిబాబు, సురేష్, నానాజి, గణేష్, కోటి, నాగు, చరణ్, నాని, సాయి, శివ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.