పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 2వ రోజు

  • నడిగడ్డ గ్రామంలో పర్యటించిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ నియోజకవర్గం: జనసేన పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టిన పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం రెండవ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ తెలకపల్లి మండలం, నడిగడ్డ గ్రామంలో పర్యటించి, జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలతో కూడియున్న కరపత్రాలతో పాటు.. ప్రజలకు, జనసైనికులకు మేలుచేసే కార్యక్రమాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలతో కూడియున్న కరపత్రాలను ఇంటిఇంటికి ఇచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతీ పల్లెకూ జనసేన ఆశయాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని తీసుకెళ్లటమే పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం ముఖ్యద్దేశ్యమని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, బైరపోగు సాంబశివుడు, గొపాస్ కుర్మన్న, ఏమ్. రెడ్డి రాకేష్ రెడ్డి, ఎదుల శరత్ గౌడ్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు జస్టిన్ బాబా, గోపాస్ రమేష్, నారముళ్ళ రవీందర్, కోడిగంటీ సాయి కుమార్, సూర్య, హారి నాయక్, రాజు నాయక్, లింగం నాయక్, ఆంజనేయులు, అంజి, భాస్కర్, మరియు తాడుర్ మండల నాయకులు, బిజినపల్లి మండల నాయకులు, నాగర్ కర్నూల్ మండల నాయకులు, తిమ్మజ్ పెట్ మండల నాయకులు, మరియు తాళ్ళపల్లి గ్రామ జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.