పేదల పెన్షన్ లను తొలగించిన ప్రభుత్వ నిరంకుశ దోరణిపై మండిపడ్డ డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుల శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నిరుపేదల పెన్షన్ లను రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా తొలగించడంపై నిరసన తెలియజేస్తూ పిఠాపురం మండల ప్రజాపరిషత్ అధికారి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన డాక్టర్ పిల్లా శ్రీధర్. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు పెన్షన్ తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయమని ఎంతోమంది వృద్ధులు వితంతువులు వికలాంగులు అనేకమంది నిరుపేదలు ఈ పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి వాళ్ళ పొట్ట మీద కొట్టడం చాలా పాపమని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. 300 యూనిట్లు దాటితేనో మరియు ఇల్లు ఉంటేనో లేదా కారు ఉందనో రక రకాల షాకులు చెప్పి పెన్షన్ ను తొలగిస్తున్న దుస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మాట తప్పం మడం తిప్పం అన్న ఈ ప్రభుత్వం జనాన్ని మోసం చేయడంలో మాత్రం ముందుందని, ఈ మోసపూరిత ప్రభుత్వం వల్ల నిరుపేదలు చాలా నష్టపోతు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డ డాక్టర్ పిల్లా శ్రీధర్. అదేవిధంగా ముందుగా వితంతు పెన్షన్ తీసేసారు భర్త చనిపోయి ఏ ఆధారం లేనటువంటి వితంతువులకు ఆసరాగా ఉండే పెన్షన్స్ ను తొలగించడం బాధాకరమైన విషయం, ఎందుకంటే మనం అలాంటి వాళ్ళని మనం ఆదుకోకపోగా వాళ్ళ పొట్ట కొట్టడం కూడా చాలా బాధాకరం, పిఠాపురం మండలం మొత్తం మీద రెండు వేల పెన్షన్లు తొలగించడంపై పిఠాపురం జనసేన పార్టీ తరఫునుంచి ఎం.డి.ఓ కు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ తొలగించడం వెంటనే నిలిపివేయాలని, అర్హులందరికీ కొత్త పెన్షన్ ఇవ్వాలని, లేనియెడల జనసేన పార్టీ తరఫునుంచి అనేక ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుందని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దుడ్డు రాంబాబు, కరిపిరెడ్డి వెంకటేష్, కంద అరవింద్, బెజవాడ శ్రీను, కూరడా సత్తిబాబు, పలివెల్ల నాని, పెనుపోతుల వీరబాబు, మోటూరి మహేష్, మాసా పెద్దపత్రయ్య, బొంతు నాగు, సైతన చిట్టిబాబు, బొండాడ జయరాజు, కట్టు శ్రీను, మాసా నాగేశ్వరరావు, వాకపల్లి శేషారావు, కటారి చంటి, మసా చిన్నపుత్రయ్య, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.