గిరిజన ప్రాంతంలో పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: బంగారు రామదాసు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం లో కించుమండ బుధవారము వారపు సంతలో జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు పర్యటించడం జరిగింది. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రైతులు పండిస్తున్న పంట కొనుగోలు ఏ విధంగా జరుగుతుంది సరైన గిట్టుబాటు ధరకు వస్తుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్న బంగారు రామదాసు రైతులతో మాట్లాడితే రైతులు సరైన గిటు బాటు ధరా లేదు దళారులు కొనటం వల్ల నష్టపోతున్నామని జనసేన పార్టీ నాయకుల కు రైతులు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అరకు నియోజకవర్గం నాయకులు బంగారు రామదాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో పండిస్తున్నటువంటి ప్రతి రైతు యొక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పెట్టుబడి పెట్టిన అసలు సొమ్ము కూడా రాని పరిస్థితి ఉందని గిరిజనులు తెలియపరుస్తున్నారని అలాగే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులలో పుట్టిన యువత గంజాయి సాగుకు గంజాయిని విక్రయించటం గాని మద్యపానాన్ని విక్రయించడం గాని చేస్తున్నారని ఆర్థిక పరిస్థితులు బాలేక ఇటువంటి చెడు అలవాట్లకు పాలవుతున్నారని తెలియపరచడం జరిగింది. కావున గిరిజన ప్రాంతంలో పండిస్తున్నటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తక్షణమే స్పందిస్తూ జిసిసి ద్వారా గాని రైతు భరోసా కేంద్రం ద్వారా గాని కొనుగోలు చేయాలని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డుంబ్రి గుడ మడలం జన సైనికులు, బూర్జముత్యాల నాయుడు, అభి, పురంధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.