పెన్షన్ల రద్దుపై నంద్యాల జనసేన శాంతియుత నిరసన

నంద్యాల జిల్లాలో కొన్నివేలమంది వృద్దాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ లను సరైన కారణాలను చూపించకుండా కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు సమర్థనీయం కావని… పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతుకుతున్న అభాగ్యుల జీవితాలను ఈ ప్రభుత్వం దుర్బరం చేసిందని, ఇప్పుడు వారు ఎలా బ్రతకాలి.. వారికి తిరిగి పెన్షన్ లను పునరుద్దరిచాలని నంద్యాల జనసేన నాయకులు చందు, సుందర్ అధికార పార్టీని ప్రశ్నించడం జరిగింది. అన్యాయం జరిగిన అభాగ్యులకు అండగా నిలవాలని, శాంతియుతంగా నిరసన చేస్తూ జాయింట్ కలెక్టర్ కు డి.ఆర్.ఓ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాము, ఫక్రుద్దీన్, సుంకన్న, చిన్న, రవి, నాగరాజు, ప్రవీణ్, సాయి, జీవన్, బంటి తదితరులు పాల్గొనడం జరిగింది.