కవిటి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన జనసేన నాయకులు

ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు ఆదేశాల మేరకు సోమవారం కవిటి హెడ్ క్వార్టర్స్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని రాష్ట్ర మత్స్యకార వికాస బాగా కార్యదర్శి నాగుల హరి బెహరా ఆధ్వర్యంలో సందర్శించి ఆసుపత్రిలొ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రిలో ప్రధాన సమస్యలు డయాలసిస్ చేసిన తర్వాత మురికి నీరు వెళ్ళడానికి డ్రైనేజీ లేక ఆ మురికి నీరు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి నిల్వ ఉండిపోతున్నాయి, ఏడుగురు డాక్టర్స్ అందుబాటులో ఉండవలసిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు, గర్భిణీ స్త్రీలు అవసరాల దృష్ట్యా ఉన్నటువంటి గైనకాలజిస్ట్ వచ్చి 4 రోజులు సేవలు అందించి సెలవులో ఉన్నారు. స్టాఫ్ ఉన్నప్పటికీ సరిపడా లేరు, స్టాఫ్ నర్స్ కొరత వల్ల సమయానికి ఇంజెక్షన్ చేసే వారు లేరు, ఇంజెక్షన్ చేయవలసి వస్తే సూపర్వైజర్ ద్వారా కాలం నెట్టుకుని వస్తున్నారు, ఆసుపత్రికి వచ్చే రోగులు కూర్చోవడానికి కుర్చీలు లేక డాక్టర్ వద్దకు వెళ్లేంత వరకు కింద కూర్చుంటున్నారు, డయాలసిస్ విభాగానికి వస్తే బెడ్లు కొరత ఉంది. ప్రస్తుతం 15 బెడ్లు ఉన్నాయి, డయాలసిస్ కి వచ్చే పేషెంట్లు 100 మంది వరకూ ఉంతున్నారు ఇది వరకు ఈ సమస్యలపై ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు జనసైనికులతో కలిసి ఆసుపత్రిలో సమస్యలపై గళమెత్తగా జిల్లా కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే వచ్చి సందర్శించి వెళ్లినప్పటికి ఇంకా సమస్యలు పరిష్కరించబడలేదు. రాబోయే రోజుల్లో దీనిపై జనసేనపార్టీ తరపున బలమైన పోరాటం చేయడం జరుగుతుంది. తదనంతరం కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే కవిటి పరిసర ప్రాంతాల విద్యార్ధులు డిగ్రీ చదువు కొరకు ఇచ్చాపురం లేదా బారువ వెళ్ళవలసి వస్తుంది రెండు కళాశాలలు 15 కిమి, 25 కిమి దూరంలో ఉన్నందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల కొరకు కవిటి హెడ్ క్వార్టర్స్ లో పోరాటం చేయడం జరుగుతుంది అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో కుసుంపురం జనసేన సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ కుమార్, జనసేన నాయకులు దుగాన దివాకర్ బడగల రామకృష్ణ, గుమ్మడి శ్యామ్, రాజశేఖర్, దశరథ, నేతాజీ, జయకృష్ణ, లోళ్ళ ధనుంజయం, హేమా చలపతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.