పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ కి జనసేన వినతిపత్రం

పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి వాటర్ కులాయి ట్యాప్ కలెక్షన్ ఇవ్వడానికి ఇంటి పన్ను ఆరు నెలల కాలపరిమితికి 500/- కంటే తక్కువ ఉన్న వారికి 200/- అదేవిధంగా ఇంటి పన్ను 500/- మించి ఉన్నవారికి 7500 రూపాయలు కట్టాలని సచివాలయ సిబ్బంది, పేర్లను నమోదు చేసుకోవడం జరుగుతుందని, అసలే ప్రజలు నిత్యావసర సరుకులు, నూనెలు, పప్పులు, అదేవిధంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగి మధ్య తరగతి కుటుంబం జీవించ లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా ఎప్పుడో వేసిన వాటర్ పైపులకు కుళాయిలు పైపులు బిగించి ప్రజల పై ఇంత పెద్ద ఎత్తున భారాన్ని మోపడం దారుణమని, ఎన్నికల ముందు ఇంటింటికి ఉచితంగా మంచినీరు అందిస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున 7500/- రూపాయలు ప్రజలపై మోపడం దారుణమన్నారు, సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం ఈ వైసీపీ ప్రభుత్వానికి చెల్లిందని ఇప్పటికైనా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు మంచి నీటి కుళాయి పైపులను ఉచితంగా ఏర్పాటు చేయాలని పిడుగురాళ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా కార్యదర్శి కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల శ్రీను,నాయకులు బయ్యవరపు రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, షేక్ మదీనా, షేక్ వలి, బేతంచెర్ల ప్రసాద్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.