ఘనంగా సీతానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

  • జనసేన శ్రేణుల్లో ఉప్పొంగిన నూతన ఉత్సాహం
  • జనసేనాని ఆశయం కోసం రెట్టించిన ఉత్సాహంతో సమిష్టిగా కృషి చేయాలంటున్న “బత్తుల”
  • పూర్తిస్థాయి హంగులతో, మరికొద్ది రోజుల్లోనే జనసేన శ్రేణులకు అందుబాటులో రానున్న మండల పార్టీ కార్యాలయం.

రాజనగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా సీతానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, జనసైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం కోసం జనసేన శ్రేణులందరూ క్షేత్రస్థాయిలో సమిష్టిగా కృషి చేయాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ పక్షాన మీ ముందు ఉంటామని, ఇక నుంచి మండల కార్యక్రమాలన్నీ ఈ మండల పార్టీ కార్యాలయం నుంచే జరుగుతాయని, పది రోజుల్లో పూర్తిస్థాయి హంగులతో, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుటకు అనువుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఈ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మట్ట వెంకటేశ్వరరావు, మద్దాల యేసుపాదం, ప్రశాంత్ చౌదరి, చికట్ల వీర్రాజు, కండ్రేగుల పోసి రత్నాజీరావు, మద్దాల జీవన్, కరాటపు బంగారం, నాగవరపు సత్తిబాబు, వరదా ప్రభాకర్ రావు, రుద్రం నాగు, పాక రామకృష్ణ, కృష్ణ, వరదా వంశీ, పెంటపాటి శివ, వీరమహిళ సూర్యవతి, బ్రహ్మం, అభిరాం నాయుడు, మాధవరపు ఏడుకొండలు, తన్నీరు సురేష్, గండి శ్రీను, కొండేటి సత్యనారాయణ, పెరుగు బాబి, బండి సత్య ప్రసాద్, రాజానగరం మండలం నుండికిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, బోయిడి వెంకటేష్, గంగిశెట్టి రాజేంద్ర, చిట్టిప్రోలు సత్తిబాబు, నాతిపాం దొర, ముక్కపాటి గోపాలం, సూల సతీష్ పంతం శ్రీనివాస్, నడిపిళ్లి రామకృష్ణ కోరుకొండ మండలం నుండి చిక్కిరెడ్డి దొరబాబు, శీర్ల సత్తిబాబు, దేవన దుర్గా ప్రసాద్ డిడి, దొడ్డి అప్పలరాజు, కొత్తపల్లి బుజ్జి, బుద్దాల అర్జున్ రావు తదితరు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.