పల్లా చంటిబాబుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం మంగితుర్తి గ్రామం నందు సీనియర్ జనసైనికుడు కార్యకర్త పల్లా చంటి బాబు కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ కారణంగా కాలికి గాయమై ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ చంటి బాబును పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తగిన జాగ్రత్తలు సలహాలను సూచనలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధు, కొండపల్లి శివ, కంద చెక్క బాబు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.