టీఎస్‌పీఎస్సీ వార్షిక నివేదిక విడుదల

టీఎస్‌పీఎస్సీ పాలకమండలి 2019-20కి సంబంధించిన వార్షిక నివేదిక ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌ భవన్‌లో అందజేసింది. ఆ నివేదికను గవర్నర్‌ తమిళిసై విడుదల చేశారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ) చైర్మెన్‌ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ ఏర్పడ్డాక ఇది 6వ వార్షిక నివేదిక అని వివరించారు. ఆరేండ్లుగా టీఎస్సీపీఎస్సీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 919 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నాయనీ, మిగతా అన్ని పోస్టులనూ భర్తీ చేశామని చెప్పారు.

ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 39,952 ఉద్యోగాలకు సంబంధించిన అనుమతులు వచ్చాయ ని వివరించారు. వాటిలో 36,758 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని అన్నారు. ఆరేండ్ల కాలంలో 35,724 ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 115 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా జరుగుతున్నదని చెప్పారు.

ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఉద్యోగాల్లో అన్నింటికీ నోటిఫికేష న్లు ఇచ్చామనీ, ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని అన్నారు. ఈవివరాల న్నింటినీ గవర్నర్‌కు వివరించా మన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి నోటిఫికేషన్లు పెం డింగ్‌లో లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనుమతి వస్తే వాటి భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధంగా ఉందన్నారు.

కాగా, ఉద్యోగాల నియామకంలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడం, విజయవంతంగా పోస్టులను భర్తీచేయడంపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌, సభ్యులను ఆమె అభినందించారు. గవర్నర్‌ను కలిసినవారిలో టీఎ్‌సపీఎస్సీ సభ్యులు విఠల్‌, చంద్రావతి, మథీనుద్దీన్‌ ఖాద్రీ, డి.కృష్ణారెడ్డి, సీహెచ్‌ సాయిలు, కమిషన్‌ కార్యదర్శి వాణీప్రసాద్‌ ఉన్నారు.