పెనుగంచిప్రోలు: జనసేన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు

పెనుగంచిప్రోలు: సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పెనుగంచిప్రోలు జనసేన ఆధ్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణ, మండల అధ్యక్షుడు తునిపాటి శివ, ఉపాధ్యక్షుడు తన్నీరు గోపినాథ్, కార్యదర్శిలు వినయ్ చారి, ఉదయ్ నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.