ఆపదలో అండగా నిలిచిన బత్తుల బలరామకృష్ణ

సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో, దుర్గమ్మ కాలనీలో నివాసముంటున్న దాసరి సత్యనారాయణ ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ఈ అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బత్తుల. అగ్ని ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రమాద బాధితులను ఆదుకోవాలని, అండగా నిలవాలని వెనువెంటనే బత్తుల బలరామకృష్ణ, వారి అల్లుడు శ్రీ తోట పవన్ కుమార్ గారిని పంపించి స్థానిక నాయకులతో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టు బట్టలు మాత్రమే మిగిలాయని బాధిత కుటుంబం వారి ఆవేదనను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారికి తక్షణ సహాయం క్రింద ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు, అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కూడా పాల్గొన్నారు.