అను శ్రీ సమక్షంలో 49 వార్డు నుంచి భారీ సంఖ్యలో జనసేన పార్టీలోకి చేరికలు

రాజమండ్రి సిటీ: స్థానిక 49 వార్డులో పటాన్ ఖాన్ మరియు గొల్తి రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 75 మంది జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఆయనకు ప్రజలు మంగళహారతులు, తీన్మార్ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకి జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని, పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా తమపార్టీ నిర్ణయం ఉంటుంది అన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మచ్చలేని నాయకులని వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర ఇంచార్జి గా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు మా అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం చాలా ఆనందపూర్వకంగా ఉందని పేర్కొన్నారు. పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరు పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన కొనియాడారు త్వరలోనే వైసీపీ పాలనను ప్రజలందరూ తరిమి తరిమి కొడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శులు దేవకివాడ చక్రపాణి, పొట్నూరు శ్రీనివాస్ ఠాగూర్, జనసేన యువ నాయకులు బయ్యపనీడి సూర్య, మరియు చౌకొండ మురళి, నర్సిపూడి రాంబాబు, దుర్గాప్రసాద్, గుణ మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.