రిజర్వేషన్ తో పదవులు వహిస్తున్న వారు తక్షణమే రాజీనామా చెయ్యాలి: తుమ్మి అప్పలరాజు దొర

విజయనగరం, ముక్కు సూటి మనిషి, గిరిజన శాఖ మంత్రి రాజన్న దొర తక్షణమే ఉద్యమబాట పట్టి నిజాయితీ నిరూపించుకోవాలి. బోయ వాల్మీకి కులస్తుల్ని గిరిజన జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బోయ వాల్మీకి కులస్తుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఇదేగాని జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 35 లక్షల జనాభా ఉన్న గిరిజన ప్రజలు ఎంతో నష్టపోతారని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం ఒక కులం ఓట్లు కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన తెగలకి అన్యాయం చేయడం అనేది ఇది తగదు. కేవలం ఒక బోయ వాల్మీకి కులస్తులు మాత్రమే ఈ రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ప్రకారం గిరిజనులకి 6.5% మాత్రమే ఉంది ఇది మా జనాభా ప్రకారంగా ఎంతవరకు చాలట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా బోయ వాల్మీకి మా జాబితాలో కలపడం అన్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ గిరిజల్లు ఎక్కువైపోయి నిజమైన గిరిజనులకి దక్కవలసిన ప్రభుత్వ పథకాలు గాని రాజకీయ రిజర్వేషన్లు గాని ఉద్యోగ రిజర్వేషన్లు గాని గిరిజనులకు చెందకుండ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బోయ వాల్మీకి కులస్తులు మా జాబితాలో చేరిస్తే నిజమైన ఆదివాసులు వెనుకబడి పోయే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క ఆలోచనలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర తెలిపారు.