జనసైనికుడు అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం: కామిశెట్టి రమేష్

గురజాల నియోజవర్గం, పిడుగురాళ్ల మండలం, కొనంకి గ్రామం యస్సి కాలనికి చెందిన జనసైనికుడు అశోక్ ప్రమాదానికిగురై మరణించారు. విషయం తెలుసుకున్న మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు. అశోక్ పార్థివదేహానికి రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చులు నిమిత్తం ఇరవై రెండువేల రూపాయలను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సపోర్టుతో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అశోక్ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఉండి, వారి కుటుంబనికి అండగా ఉన్నారు. ఈ సందర్భంగా కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ అశోక్ లేని లోటు పూడ్చలేనిదని, అశోక్ మరణించడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ కుమారుడి దహన సంస్కరాలకు సహాయం అందించిన జనసేన నాయకులకు, జనసైనికులకు అశోక్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెదకొలిమి కిరణ్, ప్రధాన కార్యదర్శి గుర్రం రామకోటేశ్వరరావు, కార్యదర్శిలు కొండేపూడి వంశీ, బేతంచర్ల నాగేశ్వరరావు, రామాయణం రాము, బలుసుపార్టీ శ్రీనివాసరావు జనసేన నాయకులు నూతి శేషు, వీర్ల సురేష్, కార్తీక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.