ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి అభినందనలు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం: తెలుగువారి కీర్తిని, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి వీరఘట్టం జనసేన నాయుకులు జనసేన జానీ, మత్స పుండరికం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఒక పండగ వాతావరణం ఇది భారతదేశంలో ఉన్న ప్రతి హీరో అభిమానులు సినీ ప్రేమికులు అందరూ ఎంతో గర్వించదగ్గ విషయం. అదేవిధంగా నాటు పాటకు అద్భతంగా లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, అధుభూతమైన సంగీతం అందించిన కీరవాణి గారికి నాటు నాటు పాటకు అద్భతంగా డాన్స్ చేసిన తారక్, రాంచరణ్ గారికి ఆర్.ఆర్.ఆర్ మూవీ కధ రాసిన విజేంద్రప్రసాద్ గారికి, దర్శకదీరుడు రాజమౌళీ గారికి సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇలాంటి అవార్డులు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావాలి అని కోరుకుంటున్నాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, సినీ ప్రేమికులు పాల్గొన్నారు.