తడిసిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి – అంజూరు చక్రధర్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని చేమూరు గ్రామంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతుల కల్లాల్లోకి వెళ్లి మొలకలు వచ్చిన వరి ధాన్యమును పరిశీలించి, రైతులను పరామర్శించడం జరిగింది. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ సదర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తొట్టంబేడు మండలం, చేమూరు గ్రామంలోని వరి రైతుల బాధలు నా దృష్టికి వచ్చాయి.. కల్లాల మీద పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈదప ధర పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు ఆవేదనే మిగిలింది… ప్రాథమిక అంచనా మేరకు ఈ గ్రామంలో 80 ఎకరాల పంట కల్లాల్లో మగ్గుతుంది. నెల బల్లి రాజయ్య అనే రైతు 10 ఎకరాలు, పెళ్లూరు గిరిబాబు 10 ఎకరాలు, పెల్లూరి రమణమ్మ 3 ఎకరాలు, గాలి చిన్న చెంగయ్య 2 ఎకరాలు, నెల బల్లి రమణయ్య 4 ఎకరాలు, చేమూరు వెంకట సుబ్బారెడ్డి 10 ఎకరాలు, కనపర్తి సుబ్బరాయుడు 4 ఎకరాలు, మరియు గ్రామస్థులంత వరి ధాన్యంతో కళ్ళాల్లో లబోదిబోమని అంటున్నారు. అధికారులు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి, తడిసిన ప్రతి గింజను రైతులు నుండి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.. రైతులకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గాలి చిన్న చేంగయ్య, నెలబళ్లి రాజయ్య, పెళ్ళురి గిరిబాబు, నెలబళ్ళి రమణయ్య, చేమూరి వెంకట సుబ్బారెడ్డి, కనపర్తి సుబ్బరాయులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.