అకాల వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు జనసేన అండ

విశాఖలో కురిసిన అకాల వర్షాల కారణంగా 59వ వార్డులో, కొండ ప్రాంతంలో, ప్రహారీ గోడ మరియు మరుగుదొడ్లకు సంబందించిన గోడ కూలిపోవడంతో రెండు కుటుంబాలకు నష్టం వాటిల్లగా, ఆ కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తూ, కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ యువ నాయకులు ముప్పెన ధర్మేంద్ర చేతుల మీదుగ చెరొక ఐదు వేలు (పది వేలు) ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కొల్లి లక్ష్మణ్, గణేష్, రాజేష్, శివ కృష్ణ, వంశీ, జగదీష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.