గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోహైల్ ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి దీనిని స్వీకరించాలని సోహైల్, కరాటే కళ్యాణి, హారికలని కోరిన ఈ నేపధ్యం లో జూబ్లీహిల్స్ పార్క్‌లో మొక్కలు నాటిన సోహైల్.. పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అరియానా, మెహబూబ్, అఖిల్‌లకు గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు. బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ పొందిన సోహైల్ జార్జిరెడ్డి నిర్మాతలతో సినిమా కూడా చేయబోతున్నట్టు నేడు ఆ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.