47 వ రోజు నో మై కాన్స్టిట్యుఎన్సీ

శ్రీకాళహస్తి, 47 వ రోజు నో మై కాన్స్టిట్యుఎన్సీ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని వీధుల్లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, నియోజకవర్గంలో తను అనేక ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ, ప్రజల పక్షాన బలంగా నిలబడుతున్నామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం పేరుతో గ్రామాల్లో కొద్ది మందికి లబ్ది చేసి ప్రజలందరి జీవితాలు మార్చేసామని ప్రగల్భాలు పలుకుతున్నది, ప్రజలకి చేసిన అభివృద్ది శూన్యం అని కాలనీ ప్రజలు వాపోయారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రభుత్వంలో చల్లాచదురైపోయారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అప్పులు లేని రాష్ట్రంగా అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని వినుత ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు గోపి, నియోజకవర్గం ఐటీ కో-ఆర్డినేటర్ కావలి శివకుమార్, గిరీష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.