వరదబాదితులకు నిత్యావసర సరుకులు, బట్టలు, బిర్యానీలు పంపిణీ చేసిన పోలవరం జనసేన

పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలములో సుమారు నాలుగు వేల వరద బాధిత కుటుంబాలకు 6లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. రహదారి సౌకర్యం కూడా లేని పుసుగొంది, తాల్లగొంది, కోయిదా, టేకురు, కట్కురు, కాసారం గ్రామాలకు జనసైనికులు పడవల మీద నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది.. గుట్టల పక్కనుండి ట్రాక్టర్ ల మీద చిగురుమామిడి, గుట్టచిగురుమామిడి, బోళ్ళ పల్లి, తుర్పుమెట్ట గ్రామాలకు పంపించడం జరిగింది. బండ్ల బోరులో ఉన్న రెండు యర్రబోరు గ్రామాలకు, నేమలిపేటలో ఉన్న రేపాకగొమ్ము గ్రామాలకు బోలోరో వాహనాలలో పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పాదం కృష్ణ, వేలేరుపాడు కొయ్యల గూడెం, జీలుగిమిల్లి మండల అధ్యక్షులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేశారు.

అశ్వారావుపేట పవన కళ్యాణ్ సేవాసమితి అధ్యక్షులు డేగల రాము అధ్వర్యంలో సేవా సమితి ద్వారా పుచిరాల గ్రామానికి రెండు వందల కుటుంబాలకు సబ్బులు, పేస్టులు, కందిపప్పు నిత్యావసరాల సరకులు పంపిణీ చేశారు. నార్లవరం, నార్లవరం కాలనీ, కొత్తూరు, చిగురుమామిడి, బోళ్ల పల్లి గ్రామాలకు సుమారు 15వందల మందికి అశ్వారావుపేట నుండి బిర్యానీ వండించి బాధితులను వడ్డించారు. పవన్ కళ్యాణ్ సేవా సమితి కోరిక మేరకు సమారిటియన్ పర్ ది నేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కొత్తూరు, గుట్ట చిగురుమామిడి గ్రామాలకు సుమారు రెండు వందల కుటుంబాలకు 2లక్షల రూపాయలు విలువ చేసే దుప్పట్లు, నైటీలు, చీరలు, టీ షర్ట్స్, పంజాబీ డ్రెస్ లు, లోయర్లు, మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదినారాయణ, సంజయ్, సుధాకర్, మోహన్, కళ్యాణ్, తులసీ, వంశీ, భాను, చంటి, తదితరులు పాల్గొన్నారు.