జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం: గొల్లప్రోలు నగర పంచాయతీకి‌ చెందిన జ్యోతుల లక్ష్మణరావు కుమారుడు జ్యోతుల వెంకటసుబ్రమణ్యం భవన నిర్మాణ కార్మికుడు, రోజువారీ కూలీ పని నిమిత్తం పిఠాపురం మండలం జల్లూరు వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదంలో గాయపడి పని చేయలేని స్థితిలో ఉండి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. వారి కుటుంబ ఆర్దిక పరిస్దితుల విషయాన్ని జ్యోతుల వెంకటసుబ్రమణ్యం గొల్లప్రోలు జనసేన నాయకులు విషయం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు గారికి పోన్ లో వివరించగా వెంటనే స్పందించిన జ్యోతుల శ్రీనివాసు గొల్లప్రోలులో గల జ్యోతుల వెంకటసుబ్రమణ్యం ఇంటికి వెళ్ళి యాక్సిడెంట్ జరిగిన తీరును అడిగి తెలుసుకొని, జ్యోతుల వెంకటసుబ్రమణ్యం కుటుంబ పోషణ నిమిత్తం తగు ఆర్దిక సహయంను అందించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు నగర జనసేన అధ్యక్షురాలు శ్రీమతి వినుకొండ శీరిషా, జ్యోతుల గోపి, కొలా నాని, నాగబోయిన వీరబాబు, జలకర్ర బాను, కీర్తి చిన్న తదితరుల ఉన్నారు.