‘కులగణనా లేక రాజకీయ రోదనా’ గోడపత్రిక ఆవిష్కణ

కాకినాడ సిటి: జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో కులగణనా లేక రాజకీయ రోదనా అని ప్రశ్నిస్తూ గోడపత్రికని ఆవిష్కరించారు. జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రభుత్వ కులగణన పేరుతో కార్యక్రమాన్ని ప్రశ్నిస్తూ ఇచ్చిన పిలుపుని పురస్కరించుకుని నేడు జనసేన పార్టీ కార్యాలయంలో ముత్తా శశిధర్ కులగణనా లేక రాజకీయ రోదనా అంటూ గోడపత్రికని విడుదల చేసారు. ఈసందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ తమ నాయకులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకు ఈ కాబోయే మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. పగలంతా ఎగేసాను రాత్రి దిగేస్తాను అన్న చందంగా ఇన్నాళ్ళూ గుర్తుకురాని ప్రజాసంక్షేమం కొత్తది ఏదో ఇప్పుడు గుర్తుకువచ్చినట్టు హడావిడిగా వాలంటీర్లను ప్రజలమీదకి ఎగదోసి కులగణన పేరు చెప్పి వారి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారనీ, అంటే వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి ఇన్నాళ్ళూ వారితో ఇన్ని కుటుంబాలకు ఒక వాలంటీర్ జవాబుదారీ అని పనిచేయిస్తున్నామని చెప్పినది అంతా బూటకమా ఇదే నిజమైతే వారితో ఇన్నాళ్ళు ఏఏ పనులు చేపించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కులాల మద్య చిచ్చుపెట్టి లబ్ది పొందడానికి ఈ ప్రయత్నమా అని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అసలు ఇలా సేకరించిన వ్యక్తిగట డేటాను ఎవరివద్ద భద్రపరుస్తున్నారో అని భయాందోళనలు వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టులో ఈ కులగణన మీద కేసు ఒకటి నడుస్తుండగా ఆఘుమేఘాలమీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని న్యాయవ్యవస్థ సమీక్షించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.