ఉల్లిగడ్డకు, ఉర్లగడ్డకు తేడా తెలియని సీఎంకి అంగన్వాడీల సమస్యలేమి తెలుస్తాయి…?: గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లె, ఉల్లిగడ్డకు, ఉర్లగడ్డకు తేడా తెలియని సీఎం జగన్ కు అంగన్వాడీల సమస్యలేమి తెలుస్తాయంటూ జనసేన రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఎద్దేవా చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీలు నిరవధిక సమ్మెలోకి దిగారు. గురువారం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఆద్వర్యంలో జనసేన పార్టీ నాయకులు సమ్మెలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు న్యాయంగానే ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఉల్లిగడ్డకు, ఉర్లగడ్డకు తేడా తెలియని సీఎంకు ప్రజల బాధలు, ఉద్యోగుల సమస్యలెలా తెలుస్తాయంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అన్నివర్గాల వారినీ మోసం చేసి అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, నాణ్యమయిన సరుకులు అందివ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలి అని, గ్రాట్యుటీ అమలు చేయాలి అని, మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్ లుగా మార్చాలి అని, అక్క చెల్లెమ్మలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతాము అని చెప్పిన ముఖ్యమంత్రి హామీని వెంటనే అమలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. అందరినీ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్వక్తం చేస్తున్న అంగనవాడీ సిబ్బందికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. న్యాయమైన డిమాండ్ సాధన కోసం ప్రభుత్వంపై పోరాటానికి దిగిన అంగనవాడీ టీచర్లు, ఆయాలకు అంగనవాడీ కేంద్రాలలో చదివే చిన్నారుల తల్లిదండ్రులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీల సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. జగన్ చేతిలో మోసపోయిన ప్రజలు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ పోరాటాలు చేస్తున్నారన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. 2024లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుతో అటు ప్రజా, ఇటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి,చంద్రశేఖర, జంగాల గౌతమ్, నవాజ్, పవన్ శంకర, కుమార్, లవన్న, ఐటీ విభాగం లక్ష్మి నారాయణ, జనార్దన్, నరేష్, ఆదినారాయణ, సీఐటీయూ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.