వజ్రకరూరు మండల జనసేన నాయకుల అరెస్ట్

ఉరవకొండ నియోజకవర్గం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపడుతున్న బంధు కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. బంద్ విజయవంతం ప్రభుత్వం పోలీసు వారిని అడ్డుపెట్టుకొని ముందస్తుగా జనసేన నాయకులను స్టేషన్ కి తరలించడం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతామని పోలీసులకు అభ్యర్థించినా మండల అధ్యక్షుడు కేశవ్ అచ్చనాల, ఉపాధ్యక్షుడు శంకర్ నాయక్, కార్యదర్శి సూర్యనాయక్ మరియు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.