పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం గాడిమొగ కాపురస్తులు ప్రమాదవశాత్తు గాయపడిన పోతాబుత్తుల రాంబాబుని కాకినాడలో పరామర్శించారు. మరియు మల్లవరం డాక్టర్ ప్రసాదు పెద్ద తల్లి కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్య రీత్యా చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు, మరియు గాడి మొగ వాస్తవ్యులు కాలాడి ధనుంజయ ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, డాక్టర్ ప్రసాద్, దూడల స్వామి, కుందే దుర్గాప్రసాద్, వైదాడి దశరదు, మల్లాడి ఆదినారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గ కాట్రేనికోన మండలం దొంతుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో గాయాలు పాలై అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న, చిట్టి మేను నరసింహమూర్తి కుమారుడు వివేక్(3వ తరగతి) తిరుపతి ఘన సతీష్ కుమార్ (4వ తరగతి) వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, మరియు ప్రభుత్వ హాస్పటల్ వద్ద చనిపోయిన ఎడ్ల నవీన్ (3వ తరగతి) వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట, సహన బోయిన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, దూడల స్వామి, పిల్లి గోపి, టెక్నిక్ విజయ్ కుమార్, గిడ్డి రత్నశ్రీ, భీమాల సూరి, సంసాని పాండురంగారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం శెట్టిపేట గ్రామస్తులు బొక్క సాంబశివరావుని అనారోగ్య రీత్యా అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట, సానబోయిన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, దూడల స్వామి, పిల్లి గోపి, టెక్నిక్ విజయ్ కుమార్, గిడ్డి రత్నశ్రీ, భీమాల సూరి, సంసాని పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.