జనసేన వీరమహిళలే నీ తాట తీస్తారు.. రోజాను హెచ్చరించిన జయరాం రెడ్డి

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ రోజమ్మ మీరు…. నేను మహిళా అనే అంశాన్ని ఎప్పుడో మర్చిపోయారు? ఆదివారం మీరు రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ నేను ఒక మినిస్టర్ని అనే అంశాన్ని మర్చిపోయి సంస్కారహీనంగా ఎదుటివారిని మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం?

మీరు గతంలో టిడిపి పార్టీలో ఉండి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మర్చిపోయారా? మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ మాటలు ఒక మారు వినండి. ఎందుకంటే మీరు టిడిపిలో ఉండి ఆరోజు కాంగ్రెస్ ఆ పార్టీ నేడు వైసీపీ. ఆ పార్టీలో ఉన్న వారే ఇప్పుడు వైసీపీ నాయకులు… అప్పుడు వీరందరినీ తిట్టిన మాటలు విన్నాం ఈరోజు వైసీపీలో ఉండి టిడిపి నాయకులను తిడుతున్న మాటలు వింటున్నాం కాబట్టి… నీ కంటికి అందరూ పిచ్చి పట్టిన పిల్ల వెధవల్లాగా కనపడడంలో తప్పులేదు.

అమ్మ రోజమ్మ నీ జగనన్న కథలు నీ కథలు రోజు విని విని మాకు సావైపోయింది తల్లి. ఇంక చాలు తల్లి నీ కథలు.. మీ అన్న కథలు…. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నామని విచక్షణ మరిచిపోయి అచ్చోచ్చిన ఆంబోతుల్లాగా ప్రజలు అసహ్యించుకుంటున్నారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాటలు మాట్లాడుతున్నారు.

అమ్మ రోజమ్మ మొన్ననే మీ పార్టీ ఎంపీ… గన్ మిస్ ఫైర్ అయింది!! ఆ దరిద్రం అంతా దేశ ప్రజలు చూడలేకపోయారు.. మీరు ఇదివరకే అసెంబ్లీలో గన్ కంటే జగనన్న ముందు వస్తారని చెప్పారు… జాగ్రత్త తల్లి జగనన్న గన్ మిస్ ఫైర్ కాకుండా చూసుకో తల్లి!!

నీలాగా సంస్కారహీనంగా మేము మాట్లాడలేము తల్లి ఎందుకంటే మాకు స్త్రీలు అంటే గౌరవం.. మీరు కనీసం ఇకనుంచి అయినా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి మరీ ముఖ్యంగా జనసేన నాయకులను కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అధికార మదమెక్కి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోం… అవసరమైతే మా జనసేన వీర మహిళలు నీ తాట తీస్తారని హెచ్చరిస్తున్నామని జయరాం రెడ్డి హెచ్చరించారు.