చెప్పుకోవడానికే తప్ప నివాసానికి పనికిరాని జగనన్న కాలనిలలోని ఇళ్ళు

  • కనీస వసతులు కూడా కల్పించలేని జగనన్న కాలనీలు ఎందుకు.. జనసేన
  • #FailureOfJaganannaColony

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పి.ఏ.సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వసతి కల్పించలేని జగనన్న కాలనీల ఇళ్ళపై దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా ప్రస్తుత పరిస్థితులను ఫోటో వీడియోల ద్వారా సోషల్ మీడియా మాధ్యమాలలో జనసేన నాయకులు రెండవ రోజు కూడా పోస్టులు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు ఆకేపాటి సుభాషిని, కీర్తన, వనజ, లక్ష్మి, చందన, దుర్గ, హేమ కుమార్, రాజేష్ ఆచారి, మునస్వామి, గుట్ట నాగరాజు, మనోజ్, కిషోర్, పురుషోత్తం, ఆదికేశవులు, సాయి, విశ్వ, డోలా కల్యాణ్ తదితరులతో కలిసి నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ తిరుపతి వాసులైన వారికి జగనన్న కాలనీ ఇళ్ల పేరుతో 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్ర కాలువ వద్ద ఇల్లు ఇచ్చి వారికి కనీస వసతులు కూడా కల్పించలేని ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారికి కావలసిన వసతులు కల్పించి, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకులను ఇళ్లను అందజేయాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను #FailureOfJaganannaColony పేరుతో సోషల్ మీడియా మాధ్యమాలలో ఆదివారం జనసేన నాయకులందరం కలిసి జగనన్న కాలనీలను సందర్శించి ఫోటోలను వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్టులు చేయడం జరిగిందని వారు తెలియజేశారు.