రాజానగరం నియోజకవర్గంలో వైస్సార్సీపీకి భారీ షాక్

రాజానగరం నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీ పనితీరు విధానాలు నచ్చకపోవడంతో అనేకమంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు. సేవే రాజకీయంగా కొనసాగిస్తూ ప్రజల్లో నమ్మకమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జనసేన నాయకులు బలరామకృష్ణ వైపు వారంతా మొగ్గుచూపుతున్నారు. ఈ దిశలోనే నిత్యం ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో భారీగా చేరికలు జరిగాయి. వైస్సార్సీపీ ప్రదాన నాయకులు, కార్యకర్తలు 25 మంది వైసిపి పార్టీని విడిచిపెట్టి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ రాజానగరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, బెజవాడ చిట్టిబాబు, శీలం సత్తిబాబు, ఆకుల పురుషోత్తం, వీరాతి పాండురంగ, నల్లమోలు చంద్రావతి, బోనం సతీష్ కుమార్, ఆకుల లక్ష్మి, యర్రంశెట్టి భవాని, బెజవాడ వెంకటలక్ష్మి తదితరులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన, టీడీపీల పొత్తు అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారంతా స్పష్టం చేశారు. జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, స్థానికంగా బత్తుల బలరామకృష్ణ పనితీరుపై నమ్మకంతో వైసిపి పార్టీని వీడి జనసేన పార్టీలో చేరినట్లు వారంతా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.