ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం

సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు – చింతోపు లింక్ రోడ్డును బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓట్లేసి గెలిపిస్తే కనీసం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. 15 సంవత్సరాల క్రితం వేసినటువంటి పేడూరు – చింతోపు లింక్ రోడ్డు రైతులకు ఉపయోగపడే రోడ్డు, అదేవిధంగా పేడూరు గ్రామస్తులకు ఉపయోగపడే రోడ్డు, అస్తవ్యస్తంగా తయారై ఉంటే కనీసం గుంటలను కూడా పూడ్చిన పరిస్థితి లేదు. ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. మరి ఆనాడు ఏం చేశాడో తెలియదు, మరి ఐదు సంవత్సరాల నుంచి అధికార పక్షంలోకి వచ్చాడు రెండున్నర సంవత్సరాలు నుంచి మంత్రిగా ఉన్నాడు. మరి ఈ రోడ్డు నిర్మాణం గురించి ఎందుకు పట్టించుకోలేదు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్న ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం, బిజెపి కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రజా ప్రభుత్వంలో భాగంగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. సర్వేపల్లి నియోజకవర్గం సమస్యలని పరిష్కరిస్తాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి ఇతను చేసినటువంటి అవినీతి అక్రమాలకు చెక్కు పెట్టడానికి ఇదొక్కటే మార్గం. కాబట్టి అందరూ కూడా మనస్పూర్తిగా ఒక్కసారి ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి ఆదరించండి. మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్పూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ప్రజలారా కళ్ళు తెరవండి. ఈ అవినీతి, అరాచకపు పాలన నుంచి సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, టీపీ గూడూరు మండల ఉపాధ్యక్షుడు కల్తిరెడ్డి శ్రీనివాసులు, రవి గౌడ్, గణేష్ గౌడ్, వినయ్, వినోద్, శరత్, నిఖిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.