భక్తవత్సలనాయుడిగా కీలక పాత్రలో

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు.

కాగా మోహన్ బాబు తన నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరని.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా రూల్స్ బ్రేక్ చేయకుండా ఉంటాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. రియల్ లైఫ్ లో మోహన్ బాబు చూపించే యాటిట్యూడ్ ని ఆన్ స్క్రీన్ ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో తన పాత్రలో చూపించారని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో తాను పోషించిన ఎయిర్ కమాండర్ పాత్ర పేరు ‘భక్తవత్సలం నాయుడు’ అని సమాచారం. భక్తవత్సలం నాయుడు అనేది మంచు మోహన్ బాబు రియల్ నేమ్ అని అందరికీ తెలుసు. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో ఆయన క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటు స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యే అధికారి పాత్రలో కనిపిస్తారట. ఇక ఇందులో మోహన్ బాబు మరియు సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు విజువల్ ట్రీట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. డైరెక్టర్ సుధా కొంగర క్రియేట్ చేసిన భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్ బాబు తన అనుభవంతో అద్భుతంగా నటించాడట ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని రేపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.