కాళ్ళ మండలం జనసేన గ్రామ కమిటీల ఆత్మీయ సమావేశం

ఉండి: కాళ్ళ మండలం జనసేన గ్రామ కమిటీల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభ ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, కాళ్ళ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు ఆధ్వర్యంలో కాళ్ళ మండలంలోని ప్రతి గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోనే మొదటిగా పూర్తి స్థాయిలో కాళ్ళ మండలంలో మొత్తం 21 గ్రామాలలో గ్రామ కమిటీలు పూర్తిచేసి ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు కాళ్ళ మండలం, సీసలి నందు గ్రీన్ వ్యూ ఇంటర్నెషనల్ ఫంక్షన్ హల్ నందు నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యులు, జనసేన నాయకులు, జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల సమక్షంలో గ్రామ కమిటీలను ప్రకటించి వారిని, జనసేన నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బముగా నాయకులు మాట్లాడుతూ కాళ్ళ మండలంలో అధ్యక్షులు రాము గారి ఆధ్వర్యంలో మండల కమిటి సహకారంతో అన్ని గ్రామంలో గ్రామ కమిటిలు ఏర్పాటు చేయటం అభినందనియమని కాళ్ళ మండల జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకుని మిగిన మండలాల్లో కూడా పూర్తిస్థాయిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చెయ్యాలని ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కాళ్ళ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు గారిని, కాళ్ళ మండల కమిటి సభ్యులను నాయకులు సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చినబాబు, పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, పీఏసీ సభ్యులు బొమ్మిడి నాయకర్, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకట లక్ష్మీ, నియోజకవర్గ ఇంచార్జ్ లు రెడ్డి అప్పల నాయుడు, విడివాడ రామచంద్ర రావు, మేకా ఈశ్వరయ్య, కసిరెడ్డి మధులత, చెనమల్ల చంద్రశేఖర్, గవర లక్ష్మీ, తోట వాసు, మండలాధ్యక్షులు కొటికలపూడి తాతాజీ, గాధం నానాజీ, మోకా శ్రీనివాస్, గుండా రామకృష్ణ, కాళ్ళ సర్పంచ్ బందా పండు, దొడ్డనపూడి ఎంపీటీసీ జెట్టిబోయిన సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్దఎత్తున హాజరుకావటం జరిగింది.