మానవత్వం చాటుకున్న బండారు

  • జనసైనికుని కుటుంబానికి 5 లక్షల ఆర్ధికసాయం
  • జనిపెల్ల యువకుడు తవిటికి వెంకటేష్ మాదిగకి బండారు శ్రీనివాస్ శ్రద్ధాంజలి తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, అమలాపురం శివారు జనిపెల్ల గ్రామవాసి మాదిగ యువకుడు, తవిటికి వెంకటేష్ మాదిగ ప్రమాదవశాత్తు అనుకోని విధంగా మరణించడం జరిగిన కారణంగా, ఈ విషయాన్ని అమలాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్, మరియు మిరియాల అశోక్ మాదిగ వారి ద్వారా, మా అధినాయకులకు, జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి చేరవేయడం, వారు వెంటనే స్పందించి, ఆ నిరుపేద టీ వెంకటేష్ మాదిగ కుటుంబానికి అండగా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఆగమేఘాల మీద మాదిగ సంఘం పెద్దలు జిల్లా నాయకులు మిరియాల అశోక్ మాదిగ వారి ద్వారా ఆ చనిపోయిన యువకుడు వెంకటేష్ కుటుంబానికి అందజేశారు. మా అధినాయకుడు జనసేనానికి, ఎంతో మానవత్వం ఉన్నదని ఒక గొప్ప సాయంగా మరోసారి నిరూపించారు. అన్ని వర్గాల వారికి అండగా, భరోసాగా ఉండే నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ వారు నిలబడడం ఇటువంటి సేవాభావం, అన్ని కులాలను, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగే జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకులకు, ధర్మమే రక్షిస్తుందని, అదే రాబోయే రోజుల్లో గెలిపిస్తుందని, పదిమందికి దారి చూపే నాయకుడు ఎప్పుడూ వర్ధిల్లాలని కోరుకుంటూ, మాదిగ దండోరా నాయకులకు, ఎమ్మార్పీఎస్ నాయకులకు, యువసేన నాయకులకు, మాదిగ సేన, ఉప కులాల నాయకులకు, అందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలియజేయుచున్నానని తెలిపారు.