కబ్జా కోరల్లో నుండి సర్కార్ స్థలాన్ని కాపాడండి

బొబ్బిలి: రామభద్రపురంలో గవర్నమెంట్ కి చెందిన స్థలంలో 56 సెంట్లులో 20 సెంట్లు సుమారు 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి జనసైనికుల్ని, మండల అధ్యక్షుడిని బెదిరించడం జరిగింది. సోమవారం బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, జనసేన రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర ఐటి రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్ కుమార్, రామభద్రపురం మండల అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, జనసైనికులు మహంతి ధనుంజయ, జమ్మూ గణేష్ ఆధ్వర్యంలో కబ్జా చేసిన స్థలాన్ని పరిశీలించి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడి బెదిరించిన వ్యక్తిని హెచ్చరించడం జరిగింది. అలాగే కబ్జా చేసిన స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకపోతే జనసేన పార్టీ తరుపున న్యాయ పోరాటం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఇందులో ప్రవీణ్, శ్రీకాంత్, ప్రసాద్, భాషా, రాము, తులిసి, సతీష్, కర్రి భాషా, గణేష్, సంతోష్, ధనుంజయ పాల్గొన్నారు.