మట్టి లో మాణిక్యం- గట్టు లో ఘనాపాటి

తంబళ్లపల్లి నియోజకవర్గం: గట్టు గ్రామంలో మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మన జనసేన నాయకుడు ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ మురళి గారి సంతానం అయిన వెంకటేశ్వర ప్రసాద్, దుర్గ ప్రసాద్ మట్టి లో మాణిక్యం గట్టు లో ఘనాపాటులు .. ఒకరు హార్టీ కల్చర్ డిగ్రీ పొందారు, ఇంకొకరు ఇంజనీరింగ్ చేసారు, అన్న తమ్ముళ్లు ఇద్దరు కలిసి ఇజ్రాయెల్ టెక్నాలజీలో మనం ఎలా అగ్రికల్చర్ చేయాలి అని రెండు ఇన్స్ట్రుమెంట్స్ చూపించడం జరిగింది. ఒకటి సోలార్ పెస్టిసైడ్ కంట్రోల్ పానెల్, ఇది రాత్రి పూట పంటలపైన బాడ్ ఇన్సెక్ట్స్ ని కిల్ చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే కంట్రోలర్ – ఇది మట్టి లో మాయిస్టర్ కంట్రోల్ మట్టి లో రూట్స్ ను క్రిమి కీటకాలు దెబ్బతీయకుండా కంట్రోల్ చేయడం, మట్టికి పోషక పదార్థాలు, ఈ మూడు అడ్వాంటేజెస్ ని కంట్రోల్ పనెల్ ద్వారా చూపించారు. మట్టికి ఎంత నీరు కావాలి, ఎలాంటి పెస్టిసిడ్స్ పంటను దెబ్బతీస్తున్నాయి, ఏ మందును వాడాలో కూడా ఈ కంట్రోలర్ చెప్తుంది, అలాగే పంటకి పోషక పదార్థాలు ఎంతుండాలి పొటాషియం, పాస్పరస్, నత్రజని, ఇలాంటివి కూడా ఈ కంట్రోలర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ ని తీసుకొచ్చేవిదంగా పనిచేస్తున్న ఈ ఇద్దరు వెంకటేశ్వర ప్రసాద్, దుర్గ ప్రసాద్ ని ఇద్దరినీ జనసేన పార్టీ తరపున డా.పసుపులేటి హరిప్రసాద్ అభినందించారు. రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, చిత్తూర్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, తిరుపతి ఉపాధ్యక్షులు పార్ధు వేల ఇంటి నందు స్మాల్ ఫ్యాక్టరీ ని విసిట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు యువతని ప్రోత్సహించే విదంగా లక్షలు సబ్సీడీ కింద రాబోయే ప్రభుత్వంలో యువతకి ఇచ్చి వారు ఉపాధి పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మన ఆస్తి యువత అని చెప్పి ప్రోత్సహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.